‘ఎఫ్ 3’లో సునీల్ కూడా ?

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) – 2019 సంక్రాతికి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన చిత్రం. అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకున్న చిత్రం. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిన చిత్రం. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. 

కరోనా లాక్‌డౌన్ టైమ్ లో ఈ సినిమా స్క్రిప్ట్ పనులని కూడా అనిల్ రావిపూడి పూర్తి చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో మారిన పరిస్థితుల నేపథ్యంలో వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్ ఒకేసారి అందుబాటులో ఉండటం కష్టం. అందుకే ఈ సినిమా ని వాయిదా వేయనున్నారనే ప్రచారం జరిగింది. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ?ఎఫ్ 3 ఇప్పుడే ఉండనుందట. అంతేకాదు.. ఎఫ్ 3లో సునీల్ కనిపించబోతున్నాడట. అంతే ఈ సారి కామెడీ ట్రిపుల్ డోస్ అన్నమాట.