ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయ్. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండగ  తొమ్మిదిరోజుల పాటు (ఈనెల 24 వరకు) జరగనుంది.యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు.

ఈసారి కరోనా, వర్షాల ప్రభావం బతుకమ్మల మీద పడనుంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇళ్ల వద్దనే పండుగ జరుపుకోవాలని భావిస్తోంది. జాగ్రత్తలు పాటించాలి. శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.