మహానటికి సర్కారు గిఫ్ట్ 

స్టార్ హీరోయిన్ అనిపించుకోవడమే హీరోయిన్స్ లక్ష్యం. కానీ కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్స్ అంతకుమించి అనిపించుకుంటారు. ఈ లిస్టులో కీర్తి సురేష్ ఒకరు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి. ఆ తర్వాత నేను లోకల్ లో నేచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేసింది. ఇక ఆమె నటించిన మూడో తెలుగు సినిమా ‘మహానటి’ సావిత్రి బయోపిక్. ఈ సినిమాతో కీర్తి స్టార్ హీరోయిన్ అంతకుమించి అనిపించుకుంది.

ఈరోజు మహానటి కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. సూపర్ స్టా మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా కీర్తిని విష్ చేశారు. ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం తరుపున కీర్తిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది.