చీటింగ్ కేసుపై కత్తి కార్తీక స్పందన
బిగ్ బాస్ తెలుగు సీజన్-1 ఫేమ్ కత్తి కార్తీకపై హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూ వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ భూమిని ఓ ప్రయివేటు కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్థిత్వానికి దిగింది. బాధితుడి దగ్గర రూ. కోటి సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుందన్నది ఆరోపణలు.
తాజాగా ఈ ఫిర్యాదుపై కత్తి కార్తీక స్పందించారు. 52 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేస్తే ఎవరు ఊరుకోరు. ల్యాండ్ కి సంబంధించి అన్ని ఎంఓఇలు నా దగ్గర ఉన్నాయి. చెక్కు రూపంలో కోటి రూపాయలు ఇచ్చారు. ఈ కేసు ను న్యాయ పరంగా ఎదుర్కొంటానన్నారు కార్తీక. అదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలో తన నామినేషన్ ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.