రంగ్ దే : కీర్తి బర్త్ డే పిక్

నితిన్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. కీర్తి సురేష్ బర్త్ డే కానుకగా రంగ్ దే నుంచి ఆమె కొత్త పిక్ ని విడుదల చేశారు. ఇందులో కీర్తి నవ్వుతూ ఆనందంగా కనిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ నెలాఖరులో చిన్ని షెడ్యూల్ కోసం చిత్రబృందం ఇటలీ వెళ్లనుంది. అక్కడ కొన్ని సన్నివేశాలు, ఒకట్రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. దీంతో సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నారు.