ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ పండగ చేసుకొనే న్యూస్ వచ్చేసింది. ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ 23న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ రానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ గోపికృష్ణ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అప్ డేటు ఇచ్చారు. ఇది ప్రభాస్ బర్త్ డే కానుకతో పాటు దసరా కానుక కూడా.

ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిదని తెలుస్తొంది. సినిమా చాలా వరకు వింటేజ్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్  నాగ్ అశ్విన్ సినిమా చేయాల్సి ఉంది. వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఆదిపురుష్’ లోనూ నటించనున్నారు. ప్రభాస్ నటించనున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రమిది.