రానా-మిహీకా హనీమూన్ పిక్.. వైరల్ !

ఆగస్టులో రానా, మిహీక పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శుభకార్యం ఘనంగా జరిగింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రానా, మిహీక హనీమూన్‌ ట్రిప్‌కు వెళ్లలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సరదాగా విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది.

తాజాగా రానాతో కలిసి తీసుకున్న చక్కటి ఫొటోను మిహీక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఇప్పుడే ఎందుకంటే..’ అంటూ రానాను ట్యాగ్‌ చేశారు. ప్రేమతో కూడిన ఎమోజీలు కూడా జత చేశారు. ఫొటోలో రానా ట్రెండీగా కనిపించారు. ఈ ఫొటో ఆమె షేర్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. రానా-మిహీకాల హనీమూన్ పిక్ గా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రానా  చేతిలో ‘అరణ్య’, ‘1945’, ‘హిరణ్యకశ్యప’, ‘విరాట పర్వం’ తదితర చిత్రాలు ఉన్నాయి.