ఐపీఎల్ : కోల్‌కతాతో హైదరాబాద్ కీలక పోరు 

టీ20 క్రికెట్‌ లీగ్‌లో భాగంగా 35వ మ్యాచ్‌ హైదరాబాద్‌, కోల్‌కతా మధ్య జరగనుంది. గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఆడిన ఎనిమిదింట్లో మూడు విజయాలు, ఐదు ఓటములతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక వార్నర్‌సేనతో పోలిస్తే కోల్‌కతాది మెరుగైన పరిస్థితి. ఆ జట్టు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలోనూ నాలుగోస్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో ఈమ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు పెరుగుతాయి. వార్నర్‌సేన ముందుకు వెళ్లాలంటే ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి. అందుకే.. ఈ ఓపెనింగ్‌ జోడీ తమ విధ్వంసం పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. దినేశ్‌ కార్తిక్‌ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న ఇయాన్‌ మోర్గాన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నిజానికి కోల్‌కతాలో ప్రధాన లోపం బౌలింగ్‌. ఎన్నో అంచనాలతో తీసుకున్న ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కమిన్స్‌ తన స్థాయి ప్రదర్శన చేయడం లేదు.

జట్లు (అంచనా)

హైదరాబాద్:

డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్ పాండే, విలియమ్సన్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌శర్మ/విరాట్‌ సింగ్‌, రషీద్‌ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌.

కోల్‌కతా:

రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్‌ గ్రీన్‌/ఫెర్గుసన్‌, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ