టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్

కోల్‌కతాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఆడిన ఎనిమిదింట్లో మూడు విజయాలు, ఐదు ఓటములతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక వార్నర్‌సేనతో పోలిస్తే కోల్‌కతాది మెరుగైన పరిస్థితి. ఆ జట్టు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలోనూ నాలుగోస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈమ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు పెరుగుతాయి.

జట్లు :

హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్ పాండే, విలియమ్సన్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌శర్మ/విరాట్‌ సింగ్‌, రషీద్‌ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌.

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్‌ గ్రీన్‌/ఫెర్గుసన్‌, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ