అఖిల్.. పెద్ద బకరా !
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అఖిల్ ని చూసి అంతా జాలీ పడుతున్నారు. ఎందుకంటే.. ? మనోడు మోనాల్ గజ్జర్ తో డీప్ వెళ్లినట్టు కనిపిస్తోంది. ఆదివారం కుమార్ సాయితో పాటు మోనాల్ కూడా ఎలిమినేట్ కాబోతుందని తెలిసినప్పుడు అఖిల్ తట్టుకోలేకపోయాడు. ఇక జీవితం అయిపోయింది అన్న రేంజ్ లో బాధపడ్డారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత మోనాల్ ఎలిమినేట్ కాకుండా తిరిగొచ్చాక అఖిల్ లో ఆనందం కనిపించింది. కానీ అఖిల్ లో కనిపించించిన ఎమోషన్, ప్రేమ మోనాల్ లో కనిపించలేదు. మిగితా వారిలాగానే అఖిల్ ని చూసింది మోనాల్.
వెళ్లేటప్పుడు, తిగిరి వచ్చాక కూడా అఖిల్ పై పెద్దగా ప్రేమ చూపలేదు. అందుకే మోనాల్ విషయంలో అఖిల్ పెద్ద బకరాగా మిగిలిపోతాడని ప్రేక్షకులు అంచనా చేస్తున్నారు. మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ ల మధ్య లవ్ ట్రాక్ నడించింది. ఆ తర్వాత మోనాల్ డబుల్ గేమ్ తెలిసి మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టారు. అఖిల్ మాత్రం మోనాల్ ది డబుల్ గేమ్ అని తెలిసినా.. ఆమెతో కనెక్షన్, ఎమోషన్ పెంచుకుంటున్నారు. ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చడం లేదు. అభిజిత్, అఖిల్ ల మధ్యలో అవినాష్ కూడా దగ్గరైనట్టు కనిపించింది మోనాల్. ఆమె వాడుకునే రకం. వాడుకొని వదిలేసే రకం. ఆమెని అఖిల్ వదిలేస్తేనే.. ముందుకు వెళ్లగలడు. లేదంటే… ఓ బకరాగా బయటికి రాకతప్పదని చెప్పుకుంటున్నారు.