గుండెపోటుతో టీవీ నటి మృతి

2020 – అన్నీ అనార్థాలే. ఈ యేడాది పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు. తాజాగా బుల్లితెర నటి జరీనా రోషన్ ఖాన్ (54) కన్నుమూశారు. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జరీనా రోషన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర నటీనటులు సంతాపం తెలిపారు.

జరీనా కుంకుమ్ భాగ్య అనే సీరియల్‌లో ఇందూ దాది పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యే రిష్టా క్యా కెహ్లతా’లో కూడా జరీనా తన నటనతో ఆకట్టుకుంది. జరీనా మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని మృణాల్ ట్వీట్ చేశారు.