హైదరాబాద్ వర్షాలు.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : కేటీఆర్

మూడ్నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ వణికిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. ఆయా కాలనీల్లో ఇంకా నీటినిల్వ తగ్గలేదు. మరికొన్ని కాలనీలో నీటి నిల్వ తగ్గిన బురద అలాగే ఉంది. ఇలాంటి టైమ్ లో హైదరాద్ లో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నారు. మరో మూడ్నాలుగు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజల ఆశ్రయం కోసం సామాజిక భవనాలను సిద్ధం చేయాలని కోరారు. నిరాశ్రయుల కోసం అన్నపూర్ణ భోజనం అందించాలని, ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని అన్నారు. మొబైల్‌ టాయిలెట్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వర్షాలపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలని నమ్మొద్దు. ప్రభుత్వం ఇచ్ఛే సూచనలని మాత్రమే పాటించాలని కోరారు. ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కోల్పోకుండా చూడటమే తమ లక్ష్యం అన్నారు.

వేలాది మందిని ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగాం. వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా 80 మంది అధికారులను నియమించాం. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 80 కాలనీల్లో నీరుందని కేటీఆర్‌ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం 37వేల రేషన్‌కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కిట్‌లో నెలకు సరిపడా నిత్యావసర సరకులు దుప్పట్లు అందిస్తున్నాం. పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేశాం. అక్కడ బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. లోటట్టు ప్రాంతాల ప్రజలు కట్టు బట్టలతో పునరావాస కేంద్రాలకి రండి. అక్కడ మీకు అన్ని వసతులని ప్రభుత్వం కలిపిస్తుందని కోరారు.