నందుకు నాన్ స్టాప్ ముద్దులు  


నందు కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్ బస్టర్’.  ర‌ష్మీ గౌత‌మ్ కథానాయిక. ఈ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన బ్లాక్ బస్టర్ టీజర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వినిపించింది తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘రాయే నువ్వు రాయే’ అనే పాట‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

ఈ పాటలో నందు-రష్మీల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. పాటలో ముద్దులే ముద్దులు. నందుకు నాన్ స్టాప్ ముద్దులు ఇచ్చింది. ఈ పాటకు Kittu Vissapragada రిలిక్స్ అందించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో నందు పోతు రాజు పాత్రలో కనిపించనున్నారు. ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడుదలకు సిద్ధంగా ఉంది. మరీ.. ఈ సినిమా టైటిల్ పేరుని నిలబెడుతుందేమో చూడాలి.