మరోసారి త్రివిక్రమ్ సినిమాలో సమంత ?

ఈ యేడాది ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దర్శకుడు త్రివిక్రమ్. ఆయన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ్. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా జరుగుతుందని సమాచారమ్. తారక్ సరసన హీరోయిన్ గా సమంతని తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు టాక్. ఇప్పటికే సామ్ కు కథ వినిపించడం.. ఆమె ఒకే చెప్పడం జరిగిందని చెబుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అనసూయ సినిమాల్లో సామ్ నటించిన సంగతి తెలిసిందే.

తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని పూర్తి చేసి త్రివిక్రమ్ వద్దకు రావాలి. దానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. ఈలోపు త్రివిక్రమ్-మహేష్ కాంబోలో మరో సినిమా వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా కోసం రెడీ అవుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి.. ఎన్ టీఆర్, మహేష్ లతో త్రివిక్రమ్ సినిమాలు రాబోతున్నాయి. వీరి మధ్యలో విక్టరీ వెంకటేష్ తోనూ త్రివిక్రమ్ సినిమా చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !