TSRTC : పండగకు 3వేల ప్రత్యేక బస్సులు

దసరా పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ 3వేల ప్రత్యేక బస్సులని నడుపుతున్నట్టు ప్రకటించింది. వాటి వివరాలని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనంగా 281 బస్సులను నడిపిస్తున్నామన్నారు. 22 నుంచి 24 వరకు 2,034 బస్సులను నడపనున్నట్లు ఆర్ఎం వెల్లడించారు. 22న 657 అదనపు బస్సులు, 23న 659 బస్సులు, 24న 614 అదనంగా బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు.  22 నుంచి 24 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, www.tsrtconline.in ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవచ్చని వివరించారు.