800 నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథగా ‘800’ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిలోనే ఈ బయోపిక్ పై వివాదాలు మొదలయ్యాయ్. మురళీధరన్ తమిళుల వ్యతిరేకి. శ్రీలంకలో తమిళులపై జరిగిన మారణకాండపై ఆయన ఎప్పుడు స్పందించలేదు. పైగా తమిళులకి వ్యతిరేకంగానే ఆయన వ్యవహరించారు. అలాంటి వ్యక్తి జీవిథకథలో విజయ్ సేతుపతి నటించడం ఏంటీ ? అని ప్రశ్నించారు.

ప్రేక్షకులు మాత్రమే కాదు. సినీ ప్రముఖులు విజయ్ సేతుపతిని తమిళుల ద్రోహీగా అభివణించారు. ఈ వివాదంపై మురళీధరన్ స్పందించారు. తాను తమిళుల వ్యతిరేకిని కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా.. ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో మురళీధరన్ మరోసారి స్పందించారు. తన బయోపిక్ నుంచి మురళీధరన్ తప్పుకోవాల్సిందిగా విజ్ఝప్తి చేశారు. నా వల్ల విజయ్ సేతుపతి ఇబ్బంది పడకూడదు. ఈ సినిమా చేయడం వల్ల విజయ్ సేతుపతి ఫిల్మ్ కెరీర్ కు హాని జరుగుతుందని, అందువల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతిని కోరాడు.

చిత్ర నిర్మాతలు ఈ పాత్రను త్వరలోనే మళ్లీ తిరిగి పొందుతారని, బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మురళీధరన్. మురళీధరన్ విజ్ఞప్తికి స్పందించిన విజయ్ సేతుపతి ధన్యవాదాలు, వీడ్కోలు అని రీట్వీట్ చేశాడు. దీంతో 800 నుంచి విజయ్ సేతుపతి అధికారికంగా తప్పుకున్నట్టయింది.