కరోనాతో కొత్త సమస్యలు.. కంటి చూపిపోయే ప్రమాదం !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తుంది. కరోనా సోకినవారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వాటిపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. తాజాగా కరోనాతో బ్రెయిన్ డ్యామేజ్‌కు సంబంధించిన తొలి కేసు ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో నమోదైంది.

కరోనా కారణంగా ఓ చిన్నారి మెదడులోని నాడులు దెబ్బతినడంతో ఆమె చూపు మందగించింది. మెదడు నాడుల్లోని కణాల చూట్టూ మైలిన్ పొర ఉంటుంది. కణాల ద్వారా జరిగే సమాచార మార్పిడికి ఈ పొర ఎంతో ముఖ్యం. అయితే వైరస్ కారణంగా..ఈ పొర దెబ్బతినడంతో నాడి వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో బాలిక చూపు మందగించింది. ఈ కేసు పూర్తి వివరాలను ప్రచురించేందుకు ఎయిమ్స్ డాక్టర్లు రెడీ అవుతున్నారు. అయితే చిన్నారికి డాక్టర్ల బృందం అందించిన వైద్యంతో 50శాతం కంటి చూపు కనిపిస్తుందని చెబుతున్నారు.