ఐపీఎల్ : రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తు.. ఇక ఇంటికే !
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ గత చరిత్ర ఘనం. మూడు సార్లు ఆ జట్టు గెలిచింది. అత్యధిక సార్లు పైనల్ కు చేరింది. కానీ ఈ సారి మాత్రం పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్ కు చేరకుండానే ఇంటిదారి పట్టనుంది. సోమవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో చెన్నై ఆఖరి స్థానంలో నిలిచి తమ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (35*, 30 బంతుల్లో, 4×4) టాప్ స్కోరర్. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్ (70*; 48 బంతుల్లో, 7×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరి ప్లేఆఫ్‌కు అవకాశాలు మెరుగుపర్చుకుంది.