బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ‘ఊపిరి’ హీరోయిన్ సోదరుడు అరెస్ట్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు మరో ఒకరిని అరెస్ట్ చేశారు. కింగ్ నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి గాబ్రియెల్లా డెమెట్రైడీస్‌ సోదరుడు అగిసియాలోస్‌ని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లొనోవాలా రిసార్ట్స్‌లో ఉండగా అతడిని అరెస్ట్ చేసిన అధికారులు అల్పాజోలమ్ టాబ్లెట్లు, హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ కేసులో బాలీవుడ్ నటుడు, గాబ్రియెల్లా పార్టనర్ అర్జున్ రాంపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన్ని కూడా ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఈ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులని ఎన్ సీబీ విచారించింది.