ధోని హైలైట్ క్యాచ్
క్యాచిలు మ్యాచ్ లని మారుస్తాయి అంటుంటారు. అయితే వికెట్ల వినకాల ఉండి అద్భుతమైన క్యాచిలని అందుకుంటాడు మహేంద్రసింగ్ ధోని. ఇక స్టెంప్ అవుట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెప్పపాటులో అవుట్ చేసేస్తాడు. సోమవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ ధోని అందుకున్న క్యాచ్ హైలైట్ గా నిలిచింది. చహర్ వేసిన బంతిని సంజూశాంసన్ లెగ్ సైడ్ కట్ చేశాడు. దానిని ధోని అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో చెన్నై ఓడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (35*, 30 బంతుల్లో, 4×4) టాప్ స్కోరర్. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్ (70*; 48 బంతుల్లో, 7×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరి ప్లేఆఫ్‌కు అవకాశాలు మెరుగుపర్చుకుంది.
150 Dismissals For MS Dhoni In IPL💛#CSKvsRR pic.twitter.com/qVfiC1HdEf
— P A N T H E R™ (@CricSurya07) October 19, 2020