గ్రేటర్ ఎమ్మెల్యేలకు వర్షం టాస్క్

హైదారాబాద్ లో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయ్. దీనిపై ముందుగానే ప్రభుత్వం, వాతావరణ శాఖ ప్రజలని అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మూడ్నాలుగు రోజుల పాటు ఇళ్లలోనే ఉండండి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. అంతేకాదు.. మంత్రి కేటీఆర్ వరుస సమీక్షలు చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకి పలు సూచనలు చేస్తున్నారు. ఈ ఉదయం వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

‘రానున్న పది రోజులపాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సాయం అందేలా చూడాలన్నారు. బాధితులందరికీ సాయం అందాలనేది సీఎం ఆలోచనా విధానమని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను పర్యవేక్షించాలని కేటీఆర్ సూచించారు. ముంపునకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.