#RamarajuForBheem ముహూర్తం ఫిక్స్ !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా నుంచి దసరా కానుకగా #RamarajuForBheem టీజర్ విడుదల చేస్తామని జక్కన్న ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.  ఈ 22న ఉదయం 11 గంటలకు ఎన్టీ ఆర్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ ని షేర్ చేశారు.

స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు  రాజమౌళి. ఇందుల్లో అల్లూరి పాత్రలో రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్ టీఆర్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు.