అంత క్లాసుని ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకుంటారా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్ రౌండర్. మాస్, క్లాసు, ఫ్యామిలీ.. ఇలా సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. అయితే ఎంత క్లాస్ సినిమా చేసిన.. ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒకట్రెండు ఫైట్స్, కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయ్. డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లోనూ ప్రభాస్ మాస్ యాంగిల్ ని చూపించారు. అయితే ప్రభాస్ తొలిసారి సింగిల్ ఫైట్, కనీసం చెప్పదెబ్బ లేకుండా సినిమా చేస్తున్నారు. అదే రాధేశ్యామ్.

రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా  హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రమిది. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథలా దర్శకుడు రాధాకృష్ణ సినిమాను చాలా రొమాంటిక్ గా తెరకెక్కిస్తున్నాడట. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ  సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదట. కనీసం ప్రభాస్ చెంపదెబ్బ కూడా కొట్టడనే ప్రచారం జరుగుతోంది. బహుశా.. ఇలాంటి సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించి ఉండరు. మరీ.. ప్రభాస్ ఇంత క్లాస్ గా కనిపించడం ఆయన అభిమానులు తట్టుకుంటారా ? అన్నది చూడాలి.

ఇక రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించనున్నారు. బిగ్ బీ అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ లో ప్రభాస్ సినిమా ఉండనుంది ప్రభాస్ నటించనున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా ఇది.