పోలీసు కుటుంబాలకు జేజేలు : జగన్
అమరులైన పోలీసులను దేశమంతా స్మరించుకుంటోందన్నారు. ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు పలుకుతోందన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లల రక్షణ విషయంలో పోలీసులు ఏమాత్రం రాజీపడొద్దు. బడుగు, బలహీనవర్గాలపై కులపరమైన దాడులు జరిగితే ఉపేక్షించవద్దని సూచించారు.
హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. కరోనా కాటుకు కొందరు పోలీసులు అమరులయ్యారని, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్ మాట్లాడుతూ… సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారని గుర్తు చేశారు.