దీదీకి పెద్ద చేయి రాలేదబ్బా !
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం వణికిపోతోంది. వారం రోజులుగా నగరంలోని వందల కాలనీలు నీటలో ఉన్నాయి. హైదరాబాద్ పరిస్థితి చూసి పక్క రాష్ట్రాలు చలించిపోతున్నాయి. తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.10కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి రూ.2కోట్ల సాయం ప్రకటించారు. చేసిన సాయం చిన్నదా.. పెద్దదా అన్నది చూడటం కరెక్ట్ కాదు. కానీ దీదీకి పెద్దచేయి రాలేదని చెప్పక తప్పడం లేదు.
మరోవైపు హైదరాబాద్ ప్రజలని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దాదాపు 80మందికి పైగా స్పెషల్ ఆఫీసర్స్ సహాయక చర్యలని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మరో 10రోజులు వారు స్థానికంగా అందుబాటులో ఉండలి. ప్రజలకి సాయం చేయాలని సూచించారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది సహాయక చర్యలని ముమ్మరం చేసింది. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలని అప్రమత్తం చేస్తోంది ప్రభుత్వం. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు.