రాధేశ్యామ్ సప్రైజ్.. అదిరింది !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులని సప్రైజ్ చేశారు. రాథాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ నెల 23న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానులని సప్రైజ్ చేశారు ప్రభాస్.

తాజాగా రాధాశ్యామ్ నుంచి ప్రభాస్ స్టన్నింగ్ స్టిల్ ఒకటి విడుదల చేశారు. వింటేజ్ కారు మీద ప్రభాస్ కూర్చొన్న పోస్టర్ ని వదిలారు. ఇందులో మహేష్ లుక్ అదిరింది. స్టయిలీష్ గా కనిపిస్తున్నారు. బర్త్ డే కానుగా రాబోతున్నమోషన్ పోస్టర్ కి ఇది ప్రీ లుక్ గా భావించవచ్చు.

రాధేశ్యామ్ ఓ ప్రేమకథ. పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రభాస్ చేస్తున్న ప్రయోగం ఇది. ఇందులో సింగిల్ ఫైట్ కూడా ఉండదు. కనీసం చెప్పదెబ్బ కొట్టే సీన్ కూడా ఉండదు. అంతా కొత్తగా.. ప్రభాస్ ని కొత్త యాంగిల్ లో చూపించబోతున్నట్టు చెబుతున్నారు.