#RamarajuForBheem స్పెషల్‌ గ్లిమ్స్ చూశారా ?

దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తారక్ లుక్ రాబోతున్న సంగతి తెలిసిందే. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 22న ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ విడుదల కానుంది. ‘రామరాజుఫర్‌భీమ్‌’ పేరుతో రానున్న ఈ సర్‌ప్రైజ్‌కి సంబంధించి ఓ స్పెషల్‌ గ్లిమ్స్‌ను తాజాగా చెర్రీ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.

‘తారక్‌ బ్రదర్‌.. నిన్ను టీజ్‌ చేసేవిధంగా ఓ స్పెషల్‌ గ్లిమ్స్‌ విడుదల చేస్తున్నా. నీలాగా కాకుండా చెప్పిన సమయానికి (గురువారం ఉదయం 11 గంటలకు) ‘రామ్‌రాజుఫర్‌భీమ్‌’ విడుదల చేస్తా.’ అని చెర్రీ ట్వీట్‌ చేశారు. చరణ్‌ ట్వీట్‌పై తారక్‌ సరదాగా స్పందించారు. ‘సోదరా.. ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమయ్యావనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. జక్కన్నతో డీలింగ్‌ కాబట్టి నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండు. ఏదైనా జరగొచ్చు!! ఏది ఏమైనా.. పూర్తి వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ నని రిప్లై ఇచ్చారు.