విజయ్ దేవరకొండ ఫాదర్.. ఓ షాకింగ్ న్యూస్ ! 


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్). అనన్య పాండే హీరోయిన్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయకుడి తల్లి పాత్ర బలంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ గుర్తింపు తీసుకొచ్చే పాత్ర ఇదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శివగామి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ భర్త పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కనిపించబోతున్నారట.

ఫ్లాష్ బ్యాక్ లో ఆయన పాత్ర వస్తుందని చెబుతున్నారు. తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ ఇడియట్ లో ప్రకాష్ రాజ్ పాత్రని పోలిఉంటుందని చెబుతున్నారు. ప్రేక్షకులకి ఒకింత షాక్ ఇచ్చేలా సునీల్ శెట్టి పాత్ర ఉంటుందని సమాచారమ్. కరోనా లాక్‌డౌన్ తో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుందని సమాచారమ్.

విజయ్, పూరి.. ఇద్దరికి ఇదీ తొలి పాన్ ఇండియా సినిమా. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత ఇద్దరికి బాలీవుడ్ ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో పూరి ఓ సినిమా చేయనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్ కథానాయకుడు యశ్ నటించే అవకాశాలున్నాయ్. ఇక సంజయ్  లీలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా రాబోతుందని చెప్పకొంటున్నారు.