నాయిని బుల్లెట్’పై పందెం
తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. పదేళ్ల వయసులో నిజాం పోలీసులు జరిపిన కాల్పుల్లో తండ్రిని కోల్పోయిన నాయిని కుటుంబం స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ నుంచి దేవరకొండ గ్రామానికి వెళ్లింది. 1970లలో హైదరాబాద్‌కకు మకాం మార్చిన నాయిని నర్సింహారెడ్డి వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా పలుమార్లు ఎన్నికయ్యారు.
జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచారు. మోడరన్ బేకరీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు రూ.6,700కు బుల్లెట్ కొని సవారీ చేసేవారు. ఆ వాహన శబ్దం వింటూ నాయిని ఎంత దూరంలో ఉన్నాడో పలువురు పందెం కాసేవారు. హైదరాబాద్‌లోని సోషలిస్టు పార్టీ కార్యాలయం నుంచి సికింద్రాబాద్‌లోని దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చేందుకు ట్యాంక్‌బండ్‌పై నుంచి తిరిగేవారు.