ఇద్దరు తెలంగాణ ఎంపీలకు కరోనా
తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ఎంపీలకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. యాదాద్రి-భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. తనకి ఎలాంటి లక్షణాల్లేవ్. అయినా కరోనా పాజిటివ్ గా వచ్చింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ లోకి వెళ్లాను. ఇటీవల తనని కలిసివారు తప్పక కరోనా టెస్టులు చేయించుకోవాలని కోమట్ రెడ్డి కోరారు.
మరోవైపు జహీరాబాద్ తెరాస ఎంపీ బీబీ పాటిల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన నేతలు, నాయకులు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఇక కరోనా బారినపడి.. దాని నుంచి కోలుకున్న తర్వాత మరోసారి అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయ్.