విషమంగా రాజశేఖర్ ఆరోగ్యం.. దేవుడిని ప్రార్థించండి !

టాలీవుడ్ దంపతులు జీవిత-రాజశేఖర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న వీరు కరోనా బారినపడ్దారు. ఈ విషయంలో వారంరోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమార్తె శివాత్మిక ట్వీట్ చేసింది.

‘కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు నాన్న పోరాటం చేస్తున్నారు. మీ అభిమానం, ప్రార్థనలు, ఆశీస్సులే.. మమ్మల్ని రక్షిస్తున్నాయని నమ్ముతున్నాం. కరోనా నుంచి నాన్న వేగంగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రార్థనలతో ఆయన కోలుకుని తిరిగి వస్తారు’

‘మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా లేదు. స్థిరంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ప్రార్థనలు మాకు కావాలి. థ్యాంక్యూ. భయపడకండి. అవాస్తవాలను ప్రచారం చేయకండి’ అంటూ వరుస ట్విట్ చేశారు. దీంతో రాజశేఖర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.