#RamarajuForBheem వచ్చేసిందోచ్ !

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోమరం భీమ్ (ఎన్టీఆర్) లుక్ వచ్చేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌గా ‘ఆర్.ఆర్.ఆర్’. దసరా కానుకగా ఈ సినిమా నుంచి #RamarajuForBheem పేరిట ఎన్ టీఆర్ లుక్ ని రిలీజ్ చేశారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో.. ఎన్ టీఆర్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ అదిరిపోయింది.

‘వాడు కనబడితో సముద్రాలు తడబడుతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగినపడతాయ్. వాటి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లని చీట్లే మండుటెండా. వాడు భూతల్లి చనుపాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్’ అంటూ ఎన్ టీఆర్ లుక్ ని రామ్ చరణ్ పరిచయం చేశారు.