వైరల్ : రజనీ గెటప్’లో సెహ్వాగ్

ఐపీఎల్’లో భాగంగా షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో సామ్ కరన్ ఒక్కడే 52 పరుగులు చేశాడు. ఇక 115 లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 12 ఓవర్లలోనే ముంబై ఊదేసింది. చెన్నై దారుణ ఓటమిపై మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో సటైర్స్ వేశారు.

ఈ సారి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గెటప్‌లో.. చెన్నై జట్టుపై విమర్శలు గుప్పించాడు. చెన్నై జట్టును సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కూడా కాపాడలేడని తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌ చేరడమేంటని విస్మయం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు తమ ఆటగాళ్లు బంతిని బాదిన శబ్దానికి సంబరపడేవాళ్లని, కానీ నిన్నటి మ్యాచ్‌లో.. బంతి వికెట్‌ను గిరాటేయకుంటే చాలని భావించారని అన్నాడు.

ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్‌నెస్‌ పెద్దగా లేని ఆటగాళ్లకు వీరు చురకలు వేశాడు. రోహిత్ శర్మని వడాపావ్ తో పోల్చడం విశేషం. ‘వడా పావ్‌కు బదులు.. సమోసా పావ్‌ మ్యాచ్‌లో పాల్గొందిని సౌరభ్‌ తివారీని ఉద్దేశించి అన్నారు. ఈ సారి వీరు కామెంట్స్ కంటే.. ఆయన గెటప్ వైరల్ గా మారింది.