మెగా బ్రదర్’కు మెగా విషెస్

మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబుని ప్రత్యేకంగా విష్ చేశారు. ‘మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి  అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!’నని మెగాస్టార్ ట్విట్ చేశారు.

సినిమాలతో బిజీగా ఉంటూనే.. బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు నాగబాబు. నవ్వుల బాబుగా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ చురుకుగానే ఉంటున్నారు. జనసైనికులకి అందుబాటులో ఉంటున్నారు. సొంత యూట్యూబ్ ఛానెల్ నా ఛానెల్ నా ఇష్టం ద్వారా సొంత వాయిస్ ని వినిపిస్తున్నారు. ఇక త్వరలోనే నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.

blockquote class=”twitter-tweet”>

Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి  అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2020