దేశంలో 90.99 శాతం రికవరీ

కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. ఓ వైపు కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నా.. అంతకు డబుల్ రికవరీ ఉంటుంది. బుధవారం 10,75,760 నమూనాలను పరీక్షించగా 49,881 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203 నమోదైంది.

గడిచిన 24 గంటల్లో 517 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,20,527కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 56,480 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 73,15,989 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 6,03,687 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 90.99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 7.51 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది.