రాహుల్ సిప్లిగంజ్ #BABY మ్యూజిక్ వీడియో.. అదిరిపోయింది !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్  #BABY పేరుతో ఓ మ్యూజికల్ వీడియోని తీసుకొచ్చారు. వీడియో సాంగ్ అదిరిపోయింది. స్టార్ హీరోల సినిమాలో ఐటమ్ సాంగ్.. అంతకుమించి అనేలా ఉంది. ఈ వీడియోకి కాన్సెప్ట్, మ్యూజిక్ రాహుల్ సిప్లిగంజ్ నే అందించారు. యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నిరూప పటేల్, ఎస్ సామ్యూల్ నిర్మించారు.

#BABY కాన్సెప్ట్ బాగుంది. నేరుగా సాంగ్, డ్యాన్సుల్లోకి వెళ్లలేదు. సాంగ్ కు ముందు స్విమ్మింగ్ పూల్ లో వచ్చే సంభాషణ హాట్ హాటుగా ఉంది. ఆ తర్వాత క్లబ్ డ్యాన్స్ ఇంకా అదిరిపోయింది. తెలంగాణ పదాలని చక్కగా వాడుకున్నారు. మొత్తానికి.. #BABY  సాంగ్ తెలుగులో కొత్త ట్రెండు సెట్ చేసెలా ఉంది. ఇక సింగర్ ఇప్పటికే నిరూపించుకున్న రాహుల్ సిప్లిగంజ్ కి నటుడిగా కూడా అవకాశాలొస్తున్నాయ్. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.