వైరల్ : కాజల్ పెళ్లిలో తీర్మాన్ స్టెప్పులు

చందమామ కాజల్ అగర్వాల్ మెడలో మరికొద్దిసేపట్లో మూడు ముళ్లు పడనున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును కాజల్ పెళ్లాడనుంది. పెళ్లి కూతురుగా ముస్తాబైన కాజల్ సిగ్గుపడుతూ కనిపిస్తుంది. అయితే అంతకుముందు జరిగిన ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో మాత్రం కాజల్ రచ్చ రచ్చ చేసింది. తీన్మార్ డ్యాన్సులతో అదరగొట్టేసింది.

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ తో పాటు ఆమె చెల్లి ఈషా అగర్వాల్ కూడా చిందేసింది. ఇక కోవిడ్‌ నేపథ్యంలో కాజల్‌ తన వివాహాన్ని నిడారంబరంగా జరుపుకోబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ముంబైలో ఈ వేడుక జరగనుంది.