నోయల్’ని బయటికి పంపేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ హౌస్ నుంచి నోయల్ బయటికొచ్చేశారు. అనారోగ్యమే ఇందుకు కారణం. చాన్నాళ్లుగా నోయల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం నాటికి అది కాస్త తీవ్రం అయింది. రాత్రంతా నోయల్ నిద్రపోలేదు. బాగా అవస్థపడ్డారు. దీంతో ఆయనికి మెడికల్ చెకప్ చేశారు. డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన చికిత్స అందించడం కోసం నోయల్ ని బయటికి రావాల్సిందిగా బిగ్ బాస్ కోరారు. 

ఆ విషయం ఇంటి సభ్యులకి చెప్పిన నోయల్ బయటికొచ్చారు. నోయల్ బయటికొస్తున్న సమయంలో సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా హారిక ఏడ్చేసింది. నోయల్ ని పంపించే సమయంలో, పంపించిన తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉంది.  నోయల్ త్వరగా కోలుకొని రీ-ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ ఆకాంక్షించారు. ఇక బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అరియనా ఎంపికయ్యారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఆమెకి మినహాయింపు లభించనుంది.