ఖుషి నడుము సీన్.. ఒరిజనల్ కాదట !

పవర్ ‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ కెరీర్ లో ‘ఖుషి’ బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాతో యూత్ లో పవన్ క్రేజ్ పెరిగిపోయింది. యూత్ ఐకాన్ గా మారారు. ఖుషి చిత్రానికి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు. పవన్ కి జంటగా భూమిక నటించారు. ఈ సినిమాలోని నడుం సీన్ హైలైట్. ఇప్పటికీ ఈ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ సీన్ లో పవన్ ఎక్స్ ప్రెషన్స్ మతులు పొగొడుతుంది.
అయితే ఈ సీన్ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయం తెలిసిందే. నిజంగా పవన్ భూమిక నడుంని చూడలేదట.

నుడుం చూడకుండానే అద్భుతమైన నటనతో కట్టిపడేశారట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా చూస్తున్నట్లు నటించి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక నడుముతో కలిపి చూపించారు. అంతేకాని ఆ ఎపిసోడ్‌లో చూపించినట్లు పవన్‌.. భూమిక నడుమును నిజంగా చూడలేదన్న సీక్రెట్ ని ఇన్నాళ్లకి బయటికి వచ్చింది.