ఆ నటిపై మోజుపడిన తెలంగాణ మంత్రి.. ఆఖరికి అడ్డంగా బుక్ !!

ఓ నటిపై తెలంగాణ మంత్రి మోజు పడ్డాడు. ఆ విషయం నేరుగా ఆమెకు చెప్పలేదు. ఆమెని ఒప్పించడానికి మరో మహిళని రంగంలోకి దింపాడు. మంత్రి తరఫున రంగంలోకి దిగిన మహిళ సినీ నటితో చర్చలు మొదలు పెట్టింది. మంత్రి చాలా మంచి వాడని, అతడితో చాలా పనులు ఉంటాయని, టచ్‌లో ఉంటే మంచిదంటూ మచ్చిక చేసుకొనే పని మొదలెట్టింది.

అక్కడితో ఆగలేదు. సినీ నటికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను కూడా తీసింది. ఆ ఫొటోలను మంత్రికి పంపించింది. ఓ రోజు మాములుగా మంత్రి పంపించిన మహిళ ఫోన్ ని చూసిన నటికి షాక్ తగిలింది. ఆమె ఫోన్ లో తన పర్సనల్ ఫోటోలు చూసి షాక్ తింది. ఆ ఫోటోలు, ఆమె మంత్రితో జరిపిన చాట్ ని స్క్రీన్ షాట్ తీసింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మన దేశ రాజధానిలో నిర్భయపై జరిగిన హింసాకాండ. మన రాష్ట్ర రాజధానిలో దిశపై జరిగిన హింసాకాండ. నేటికీ ఏ మార్పు రాలేదు. మహిలలపై ఈ హింసని మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆపలేమా? మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకవేళ మనం నమ్మిన నాయకులే మహిళలపై రాక్షస వాంఛతో ప్రవర్తిస్తే వాళ్లని ఏం చేయాలి?’ రాసుకొచ్చింది.

ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు మంత్రి పదవి ఊడే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు ? ఆయన మోజు పడిన సినీ నటి ఎవరు ? అందరికీ తెలిసిన ఎవ్వరూ బయటపడటం లేదు.