రోజాతో బండ్ల.. పవన్ సినిమా కోసమేనా ?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్, సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజాని కలిశారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చాన్నాళ్ల తర్వాత రోజాని కలవడం జరిగింది. ఆమె కెరీర్ బాగుండాలి అంటూ ఆకాంక్షించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రోజాని బండ్ల కలవడం వెనక పవర్ స్టార్ సినిమా ఆఫర్ దాగి ఉందా ? అనే చర్చ కూడా మొదలైంది.
పవర్ స్టార్ ఓకే చెప్పేశారు అని ఇటీవలే బండ్ల ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత బండ్లకి మరో అవకాశం ఇచ్చారు పవన్. ఈ సినిమా దర్శకుడు ఎవరు ? కథేంటీ ? నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. దానికి ఇంకా చాలా టైముంది. ఎందుకంటే ? వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలని పవన్ పూర్తి చేయాల్సిఉంది.
ఇంతలో బండ్ల సలైంట్ గా నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే రోజాని కలిశారు. ఆమెని పవన్ సినిమా కోసం ఒప్పిస్తున్నారా ? అన్నది లెటెస్ట్ పిక్ తో పుట్టుకొస్తున్న గాసిప్స్. చాన్నాళ్లుగా రోజా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. అయితే పవన్ సినిమా ఆఫర్ అంటే.. ఆమె కూడా ఈజీగా ఓకే చెబుతుందని చెప్పుకుంటున్నారు.
After long time I met @RojaSelvamaniRK god bless with Successful career and good health and wealth
pic.twitter.com/gGO4WSBmcE
— BANDLA GANESH. (@ganeshbandla) October 30, 2020