తెరాసలోకి దుబ్బాక భాజాపా అభ్యర్థి !?
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. రేపటితో దుబ్బాక ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో.. మూడు ప్రధాన పార్టీలు తెరాస, కాంగ్రెస్, భాజపా అఖరి పంచ్ లు కొడుతున్నాయ్. ఓటర్లనీ ఆకట్టుకొనేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఓ కొత్త విషయాన్ని ఎత్తుకుంది. తెరాస, భాజాపా ఒక్కటేనని ప్రచారం చేస్తోంది.
భాజాపా అభ్యర్థి రఘునందన్‌రావు, హరీశ్ రావులు బంధువులు. రఘునందన్ గెలిస్తే తెరాసలోకి వెళ్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక నుంచి జూమ్ యాప్, ఫేస్‌బుక్ ద్వారా కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలతో ఆయన మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని.. ఇప్పుడు మెరుగైందన్నారు. ప్రస్తుతం దుబ్బాకలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని, దాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని పార్టీ ఇన్‌ఛార్జిలకు ఉత్తమ్ సూచించారు.