ఏబీ.. పెద్ద బిస్కెట్.. ఎందుకంటే ?

ఐపీఎల్ లో బెంగళూరు బలంగా కనిపిస్తుంటుంది. కానీ ఇంత వరకు టైటిల్ గెలవలేదు. ఈ సారి కచ్చితంగా టైటిల్ గెలవాలనే కసితో ఉంది. అది జరగాలంటే.. ముందు ప్లేఆఫ్ కు చేరాలి. ఆ అవకాశాలు బెంగళూరుకి మెండుగానే ఉన్నాయి. అయితే బెంగళూరు జట్టులో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ప్రత్యేక ఆకర్షణ. వీరిలో ఒక్కరు నిలబడిన ఆ మ్యాచ్ బెంగళూరు గెలిచినట్టే. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఏబీ..ని కోహ్లీ బిస్కెట్ అని పిలుస్తాడు. అలా ఎందుకు పిలుస్తాడు అంటే.. ?

దక్షిణాఫ్రికాలో ఇష్టమైన వారిని ‘బిస్కట్‌’ అని పిలుస్తారనీ తానెంతో అభిమానించే ఏబీని తనూ ‘బిస్కట్‌’ అనే పిలుస్తానని కోహ్లీ ఓ  ఇంటర్వ్యూలో చెప్పాడు. బెంగళూరు జట్టు క్యాప్షన్‌ ‘ప్లే బోల్డ్‌’ అన్న సంగతి తెలిసిందే. దీని గురించి కోహ్లీ స్పందిస్తూ.. భయపడకుండా దూకుడుగా ఆడడమని… ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం అని తెలిపారు.