అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయ్. కరోనా విజృంభణ కాస్త తగ్గిందని భావిస్తున్న టైమ్ లో సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ ని ఆశ్రయిస్తున్నాయ్. తాజాగా జర్మనీలో మళ్లీ లాక్‌డౌన్‌  విధించారు. అక్కడ ఈరోజు నుంచి  పాక్షిక లాక్‌డౌన్‌ పాటించనున్నారు. ఈ మేరకు జర్మన్ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్ లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రకటించారు. కనీసం రెండు వారాలపాటు ఈ లాక్‌డౌన్‌  ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలని ప్రకటించారు.

* రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తారు. టేక్‌ అవేకు అవకాశం ఉంటుంది

*పెద్ద పెద్ద సమావేశాలు రద్దు

* అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు నిషేధం

* పర్యాటక ప్రయోజనాల కోసం హోటళ్లలో రాత్రిపూట బస నిషేధం * ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం. 

* 10 మందితో రెండు కుటుంబాలు మాత్రమే కలిసి శుభకార్యాలు చేసుకునేందుకు అనుమతి

*  థియేటర్లు, సినిమాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, స్టీమ్‌బాత్‌ సెంటర్లు బంద్

* క్రీడాకార్యక్రమాలకు ప్రేక్షకులకు అనుమతి లేదు