‘గుర్తుందా శీతాకాలం’కు హీరో కావాలి !

త‌మ‌న్నా-స‌త్య‌దేవ్ జంటగా ప్రారంభమైన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకుడు. చిత్ర‌బృందం ఇప్పుడు ఆడిష‌న్స్ కోసం పిలుపు ఇచ్చింది. క‌థానాయ‌కుడి ఫ్లాష్ బ్యాక్ పాత్ర కోసం ఓ అబ్బాయిని వెదికి ప‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. 12 నుంచి 15 ఏళ్ల‌లోపు అబ్బాయి కావాల‌ని ప్ర‌క‌టించింది.

అంతకుముందు ఈ సినిమా ఆగిపోయింది. సినిమా నుంచి తమన్నా తప్పుకోవడం వలనే బ్రేక్ పడిందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్రబ్రందం ఆడిషన్స్ కోసం పిలుపునిచ్చింది. అదే సమయంలో ఈ సినిమాలో న‌టిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని క్లారిటీ ఇచ్చింది. అన్నట్టు ఈ రొమాంటిక్ టైటిల్ త్రివిక్రమ్ ది. ఆయన నుంచి అడిగి తీసుకున్నారని తెలిసింది.