గుత్తా జ్వాల అకాడ‌మీ ప్రారంభించిన కేటీఆర్

ప‌్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడ‌మీ ఆఫ్ ఎక్స‌లెన్సీని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు జ్యోతి ప్ర‌జ‌ల్వ‌న చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అకాడమి అంతా తిరిగి చూశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుత్తా జ్వాలా గ‌తంలో స‌హ క్రీడాకారుడు చేత‌న్ ఆనంద్ ను వివాహం చేసుకుని అనంత‌రం విడాకులు తీసుకుంది. ఆ తర్వాత గుత్తా జ్వాల తమిళ్ హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విశాల్ కు కూడా గ‌తంలో వివాహ‌మైంది. గ‌త ఏడాదే భార్య ర‌జ‌నీకి విడాకులు ఇచ్చాడు.. అప్ప‌టి నుంచి విశాల్ ఈ బ్యాడ్మింట‌న్ స్టార్ ప్రేమ‌లో ఉన్నాడు.