పంజాబ్’ని వెంట తీసుకెళ్లిన చెన్నై

ఐపీఎల్-13లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే చెన్నై ప్లే ఆఫ్ ఆశలు దూరమయ్యాయ్. అయితే మిగిలిన రెండు మ్యాచ్ లలో ఇతర జట్ల రాతలు మార్చింది చెన్నై. కోల్ కతా ని ఓడించి.. ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలకి సంక్లిష్టం చేసింది. అయితే నిన్నటి రాజస్థాన్ తో మ్యాచ్ లో కోల్ కతా గెలిచింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఘన విజయం సాధించింది.

అబుదాబి వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వైదొలిగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీపక్ హుడా (62*; 30 బంతుల్లో, 3×4, 4×6) అజేయ అర్ధశతకంతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 18.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ (62*; 49 బంతుల్లో, 6×4, 1×6), డుప్లెసిస్‌ (48; 34 బంతుల్లో, 4×4, 2×6) సత్తాచాటారు.