ఆర్ఆర్ఆర్ వివాదం.. రాజమౌళి సంచలన నిర్ణయం !
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నభారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితకథల్లోని ఓ కామన్ పాయింట్ తో ఈ కథని రాసుకున్నట్టు గతంలోనే జక్కన్న తెలిపారు. అయితే రామ్ చరణ్, ఎన్ టీఆర్ ఫస్ట్ లుక్ లని రిలీజ్ చేసే విషయంలో వివాదాలు మొదలయ్యాయ్.
‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ తో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ లో కనిపించారు. అల్లూరికి పోలీస్ డ్రెస్ వేయడమేంటీ ? అనే కామెంట్స్ వినిపించాయి. ఇక ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ తో ఎన్ టీఆర్ లుక్ ని చూపించారు జక్కన్న. ఈ టీజర్ ఆఖరులో ఎన్టీఆర్ ముస్లిం డ్రెస్ లో కనిపిస్తాడు. దీనిపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కొమరం భీమ్ గెటప్ అలా ఉండదని ఫైర్ అవుతున్నారు.
ఇప్పుడీ వ్యవహారానికి రాజకీయ రంగు పులుపుకుంది. తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బిడ్డా.. రాజమౌళి సినిమా ఎలా రిలీజ్ చేస్తావో చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాజమౌళి మాత్రం నోరు తెరవడం లేదు. అంతేకాదు.. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పై ఎవరు కూడా మాట్లాడొద్దని చిత్రబృందానికి జక్కన్న ఆదేశాలు జారీ చేశారట. ఎన్ టీఆర్ లుక్ పై వివరణ ఇస్తే సినిమా కాన్సెప్ట్ లీకవుతుందనే భయంతో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తొంది. అందుకే ఇప్పుడు సలైంట్ ఉండి.. అవసరమైతే.. సినిమా రిలీజ్ కి ముందు క్లారిటీ ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు సమాచారమ్.