తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి  తెలంగాణ ఐసెట్ ఫలితాలువిడుదల చేశారు. ఈ ఏడాది 90.28శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన తెలిపారు.కరోనాతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ బాగా చదివి అర్హత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు.

ఐసెట్ ఫలితాల్లో తొలి ఐదు ర్యాంకులు సాధించిన వారి వివరాలు :

* బి.సుభశ్రీ – ఎస్‌ఆర్‌ నగర్‌, హైదరాబాద్‌ (మార్కులు 159.5)

* జి. సందీప్‌ – ఆర్మూర్‌, నిజామాబాద్‌ (మార్కులు 144.50)

* అవినాశ్‌ సిన్హా – ఈసీఐఎల్‌, హైదరాబాద్‌ (మార్కులు 142.43)

* ఎ. ప్రసన్న లక్ష్మీ – వరంగల్‌ (మార్కులు 142)

* శ్రీకృష్ణసాయి – ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి (మార్కులు 141.40)