బిగ్ బాస్’పై ఓటర్లు ఆగ్రహం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఎనిమిది వారాలని పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం అమ్మ రాజశేఖర్ కు తక్కువ ఓట్లు పోల్ అయ్యాయ్. దీంతో ఆయన ఎలిమినేట్ అవుతున్నట్టు హోస్ట్ నాగ్ ప్రకటించారు. రాజశేఖర్ కూడా ఎలిమినేట్ అయ్యానని మనసు నిమ్మలం చేసుకొని.. బట్టలు సర్థుకొని బయటికి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతలో బిగ్ బాంబ్ పేల్చాడు బిగ్ బాస్. ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదు. అమ్మ రాజశేఖర్ మీరు కూడా ఈ వారం సేఫ్ ని నాగ్ ప్రకటించి ఆశ్చర్య పరిచారు.

మిమ్మల్ని నోయల్ సేవ్ చేశారు. నోయల్ వెళ్తూ వెళ్తూ.. సర్ ఈ వారం నేను వెళ్తున్నాను. కాబట్టి ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయండని రిక్వెస్ట్ చేశారు. నోయల్ రిక్వెస్ట్ నేను, బిగ్ బాస్ కూడా ఓకే చేశాం. అందుకే ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో వివాదాలు వస్తున్నాయి. అభిజిత్-మోనాల్-అఖిల్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వారిని బిగ్ బాస్ కాపాడుతున్నారు. వారి వలన దేవినాగవల్లి, దివి, కుమార్ సాయి లాంటోళ్లు బలవుతున్నారనే విమర్శలున్నాయ్. ఇదీగాక బిగ్ బాస్ ఓటర్లకి విలువ ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు.

నిన్నటి ఎలిమినేషన్ నే తీసుకోండి. మెహబూబ్, అమ్మ రాజశేఖర్ లలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇచ్చారు. ఫైనల్ గా మీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ కావాలో.. మీరే డిసైడ్ కండి.. అంటూ మెహబూబ్, రాజశేఖర్ లకి నాగ్ చెప్పాడు. అలాంటప్పుడు ఓటర్లు ఎందుకు ? ఓట్లు వేయడం ఎందుకు ?? అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అందుకే ఇకపై తాము ఓట్లు వేయమని కొందరు నెటిజన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరీ.. ఓటర్ల ఆగ్రహాన్ని బిగ్ బాస్ సీరియస్ గా తీసుకుంటారా ? ఇప్పటికైనా మారుతారా? చూడాలి.